పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతుల ధాన్యం కొనాల్సిందే: మంత్రి నిరంజన్‌రెడ్డి
పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.
కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుచేయాలని కోరుతామని, స్పష్టమైన హామీ రాకపోతే సీఎం కేసీఆర్ ప్రకటించిన దానికి అనుగుణంగా ముందుకువెళ్తామన్నారు. వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు అర్థరహితమన్నారు. ఈ విషయంపై మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదా ఆ శాఖ అధికారులు మాట్లాడాలిగానీ బండి సంజయ్‌కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేంద్రం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రతి గింజా కొనుగోలు చేయాలి: మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్ర సర్కారే కొనుగోలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని చెప్పారు. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ రూపొందించాలని కోరతామన్నారు. కేంద్ర సర్కారుతో తాడోపేడో తేల్చుకుని వస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

