నీళ్లు నిల్.. మద్యం ఫుల్!
చెరువులు ఎండిపోయి.. కాలువల్లో నీరు లేక, వేసిన పంటలు చేతికి రాక రైతాంగం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన సర్కార్, మద్యం అమ్మకాల్లో మాత్రం అద్భుతమైన ప్రణాళికను అమలుచేసింది. నీళ్లను ఎత్తిపోసేందుకు, విద్యుత్తు సరఫరా చేయడంలో చేతులెత్తేసిన పాలకులు, రాష్ట్రంలోని 17 మద్యం డిపోల నుంచి లారీల కొద్దీ మద్యం సీసాలను మారుమూల పల్లెలకు సైతం నిరంతరాయంగా తరలించగలిగారు.
- దసరాకు పల్లెల్లో పారిన మద్యపుటేరులు
- పండుగనాడు రూ. 755 కోట్ల అమ్మకాలు
- 19 నాటికే రూ.2,054 కోట్లు దాటిన విక్రయాలు
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): చెరువులు ఎండిపోయి.. కాలువల్లో నీరు లేక, వేసిన పంటలు చేతికి రాక రైతాంగం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన సర్కార్, మద్యం అమ్మకాల్లో మాత్రం అద్భుతమైన ప్రణాళికను అమలుచేసింది. నీళ్లను ఎత్తిపోసేందుకు, విద్యుత్తు సరఫరా చేయడంలో చేతులెత్తేసిన పాలకులు, రాష్ట్రంలోని 17 మద్యం డిపోల నుంచి లారీల కొద్దీ మద్యం సీసాలను మారుమూల పల్లెలకు సైతం నిరంతరాయంగా తరలించగలిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్ల కాలంలో ఏ ఏడాదికి ఆ ఏడాది మద్యం ఏరులు పారించడంలో రికార్డులు సృష్టిస్తున్నది. ఈ ఏడాది దసరా పండుగకు రూ.755.14 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. నిరుడు దసరాకు రూ.697.23 కోట్లతో పోలిస్తే రూ.57.91 కోట్లు అధికం. ఇంత కరువు కాలంలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుమారు 8.3 శాతం మేర వ్యాపారం పెంచుకున్నది. విచిత్రం ఏమిటంటే గత దసరా పండుగ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఆశావహులైన అభ్యర్థులు ఖర్చు పెట్టడంతో మద్యం విక్రయాలు బాగానే జరిగాయి.
కానీ ఇప్పుడు ఏదీ లేకుండానే పాత రికార్డును అధిగమించడం గమనార్హం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అందించిన నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపులు, 1,133 బార్లలో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ నెల మొదటి 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొత్తం మద్యం విక్రయాల విలువ ఏకంగా రూ.2,054.51 కోట్లకు చేరుకున్నది. నిరుడు ఇదే సమయానికి నమోదైన అమ్మకాలు రూ.1,499.46 కోట్లతో పోలిస్తే ఏకంగా రూ.555.5 కోట్ల నికర పెరుగుదల. ఇందులో లికర్ అమ్మకాలు 14.16 లక్షల కేసుల నుంచి 18.38 లక్షల కేసులకు, బీర్ల విక్రయాలు 21.55 లక్షల కేసుల నుంచి ఏకంగా 30.37 లక్షల కేసులకు పెరిగాయి.
గతంలో పది రోజుల వ్యవధిలో 17 లక్షల వరకు బీర్లు అమ్ముడు పోవడమే గరిష్ఠం అనుకుంటే, ఈ ఏడాది కేవలం 19 రోజుల వ్యవధిలోనే బీర్ల అమ్మకాలు ఏకంగా 30 లక్షల కేసుల మైలురాయిని దాటిపోవడం గమనార్హం. పంటలకు సాగునీరు పారించలేకపోయినా, మద్యం సరఫరాలో ఒక గంట కూడా కొరత రాకుండా ప్రభుత్వం నడిపించిన తీరు చూస్తే ఖజానా వేట తప్ప పాలకులకు ప్రజారోగ్యం గానీ, గ్రామీణ రైతాంగ క్షేమం గానీ పట్టలేదని తేటతెల్లమవుతున్నది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడంలో గానీ, ఎండిపోతున్న ఆయకట్టుకు తాతాలికంగా నీరందించేందుకు నిధులు విడుదల చేయడంలో గానీ కనిపించని చురుకుదనం, మద్యం డిపోల నిర్వహణలో, మద్యం సరఫరా గొలుసులో కనిపించడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
జోరుగా బెల్టు మాఫియా
రాష్ట్రంలోని మద్యం అమ్మకాల వ్యవస్థను పరిశీలిస్తే ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎంతటి భారీ అక్రమ దందా నడుస్తున్నదో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో అధికారికంగా 2,620 లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాలు, సుమారు 1,200 బార్లు, రెస్టారెంట్లు రోజుకు 12 గంటలపాటు నడుస్తున్నాయి. రిటైర్డ్ ఎక్సైజ్ అధికారులు, నిపుణుల సాంకేతిక విశ్లేషణ ప్రకారం, ఒక మద్యం దుకాణంలో కౌంటర్ వద్ద సిబ్బంది క్షణం తీరిక లేకుండా, ప్రతి రెండు నిమిషాలకూ ఒక బాటిల్ చొప్పున నిర్విరామంగా అమ్మినా రోజుకు గరిష్ఠంగా 30 పెట్టెలకు (ఒక పెట్టె = 12 ఫుల్ బాటిళ్లు లేదా 48 క్వార్టర్లు) మించి విక్రయించలేరు.
ఈ లెకన రాష్ట్రంలోని మొత్తం 2,620 అధికారిక దుకాణాల ద్వారా రోజుకు సుమారు 39,300 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యే ఆసారం ఉంది. అలాగే 1,200 బార్లు, రెస్టారెంట్లలో ప్రతి 10 నిమిషాలకూ ఒక బాటిల్ చొప్పున విక్రయించినా రోజుకు 7,200 పెట్టెల కంటే ఎకువ అమ్ముడుపోవు. అంటే రాష్ట్రంలోని షాపులు, బార్ల గరిష్ఠ విక్రయ సామర్థ్యం రోజుకు 47,000 పెట్టెలకు మించకూడదు. కానీ ఎక్సైజ్ శాఖ లెకల ప్రకారమే రోజుకు సగటున లక్ష పెట్టెల బీరు, లక్షా 10 వేల పెట్టెల హార్డ్ లికర్ డిపోల నుంచి దుకాణాలకు తరలిపోతున్నాయి. రోజుకు 47 వేల పెట్టెల సామర్థ్యం ఉన్న దుకాణాల నుంచి ఏకంగా 2.10 లక్షల పెట్టెల మద్యం ప్రజల గొంతుల్లోకి ఎలా దిగుతున్నదనే వాస్తవాన్ని పరిశీలిస్తే..
అధికారిక బెల్టు మాఫియా గుట్టు బట్టబయలు అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా, వాడవాడలా పుట్టగొడుగుల్లా వెలిసిన దాదాపు 1.25 లక్షల అక్రమ బెల్టు దుకాణాలే ఈ అదనపు విక్రయాలకు కేంద్రాలుగా మారాయి. మొత్తం మద్యం అమ్మకాలలో 70 శాతానికి పైగా వ్యాపారం ఈ అనధికారిక బెల్టు షాపుల ద్వారానే యథేచ్ఛగా సాగుతున్నట్టు ఎక్సైజ్ వర్గాలే లెక్కలు వేస్తున్నాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారులకు నిర్దేశించిన పరిమితులను తుంగలో తొకి, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయిస్తూ ప్రభుత్వం పరోక్షంగా ఈ దందాను నడిపిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

