MLC Kavitha | జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది.
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చరిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కలాలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు.
పాల్గొన దలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలి. తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చు. నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలతో ఈ నెల 26 లోపు kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలి.
కవులు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్పూర్తిని చాటిచెప్పాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ నేల మీద అనేక గొప్ప కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా సామాజంలో చైతన్యాన్ని రగిలించారని, ఆ పరంపరంను కొనసాగించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ రచయితలు, కవులు, కవయిత్రుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని, ఆ స్పూర్తితో తాము ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.
అయితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాహిత్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అలాగే, జానపదానికి గౌరవం దక్కడం కోసం జీవితాంతం కృషి చేసిన బిరుదురాజు శత జయంతి కు రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని, గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, ఘనపురం దేవేందర్, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్ రావు, మనోజ్ గౌడ్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

