Inter Exams | 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్.. 8:45 గంటల వస్తే పరీక్షరాసే చాన్స్ కోల్పోయినట్టే
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షకు అనుమతించనున్నది.
- 8:45 గంటల వరకే ఎంట్రీ
- సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్‌బోర్డు
- ఇది వరకు ఒక నిమిషం లేట్ నిబంధన అమలు
- ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు
Inter Exams | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షకు అనుమతించనున్నది. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని నిర్ణయించింది. విద్యార్థులు ఉదయం 8:30గంటలకల్లా పరీక్షాహాల్‌లో ఉండాలన్న నిబంధనను బోర్డు తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది.
ఇలా పరీక్ష ముందే గేట్లు క్లోజ్ చేయడం ఇదే తొలిసారి. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేయగా.. 9,96,541 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్టియర్ వారు 4,88,316 ఉండగా, 5,08,225 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు, జిల్లా కంట్రోల్ రూం ఇన్చార్జి నంబర్లను సంప్రదించవచ్చు.
నిమిషం నిబంధన మరిచిపోవాల్సిందే..
ఇంటర్ పరీక్షల్లో నిమిషం లేట్‌గా వచ్చిన వారికి నో ఎంట్రీ నిబంధన చాలా కాలంగా అమలవుతున్నది. ఈ నిబంధన కారణంగా పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులెందరో త్రుటిలో అవకాశం చేజార్చుకున్నారు. 2024 మార్చి వార్షిక పరీక్షలప్పుడు తొలిరోజే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సెంటర్‌కు ఆలస్యంగా చేరుకోవడం, సదరు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తేరుకున్న సర్కారు నిమిషం నిబంధనను సడలించి, ఐదు నిమిషాల వరకు మినహాయింపు ఇచ్చింది.
ఆ తర్వాతి పరీక్షల్లో ఐదు నిమిషాలు లేట్‌గా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతి ఇచ్చారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సమయంలోనూ ఐదు నిమిషాలు లేట్ నిబంధన అమలయ్యింది. కానిప్పుడు 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఒక నిమిషం లేట్ ఎంట్రీ నిబంధన కాలగర్భంలో కలిసిపోయినట్లయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

