హైకోర్టులో మహిళా న్యాయవాదుల హాళ్లు ప్రారంభం
హైకోర్టులో మహిళా న్యాయవాదుల కోసం పునరుద్ధరించిన అసోసియేషన్ హాళ్లను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్ కోశీ శుక్రవారం ప్రారంభించారు. హైకోర్టులోని 13, 15వ కోర్టు హాళ్ల పకన ఈ హాళ్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైకోర్టులో మహిళా న్యాయవాదుల కోసం పునరుద్ధరించిన అసోసియేషన్ హాళ్లను తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్ కోశీ శుక్రవారం ప్రారంభించారు. హైకోర్టులోని 13, 15వ కోర్టు హాళ్ల పకన ఈ హాళ్లను ఏర్పాటు చేశారు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సురేందర్రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
మహిళా న్యాయవాదుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హాళ్లను పునరుద్ధరించినట్టు అసోసియేషన్ కార్యవర్గం తెలిపింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యవర్గం జస్టిస్ శ్యామ్ కోశీకి కృతజ్ఞతలు తెలిపింది.
ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి హెచ్ఈఈవో సస్పెన్షన్
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(హెచ్ఈఈవో) కే శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. సీజ్ చేసిన ఓ ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

