కారు దిగి.. బొకే ఇచ్చి
అది హైదరాబాద్‌లోని అబిడ్స్. నిత్యం రద్దీగా ఉండే బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రతిరోజూ వెళ్లే మార్గం అది. అంత ప్రాధాన్యం ఉన్న ఆ మార్గంలో అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుంటారు. శుక్రవారం.. ఎప్పటిమాదిరిగా అష్రఫ్ విధులు నిర్వహిస్తుండగా.. ప్రధాన న్యాయమూర్తి కారు అకస్మాత్తుగా చౌరస్తాలో ఆగింది.
- అంకితభావంతో హోంగార్డు అష్రఫ్ అలీ విధి నిర్వహణ
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ అభినందన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అది హైదరాబాద్‌లోని అబిడ్స్. నిత్యం రద్దీగా ఉండే బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రతిరోజూ వెళ్లే మార్గం అది. అంత ప్రాధాన్యం ఉన్న ఆ మార్గంలో అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుంటారు. శుక్రవారం.. ఎప్పటిమాదిరిగా అష్రఫ్ విధులు నిర్వహిస్తుండగా.. ప్రధాన న్యాయమూర్తి కారు అకస్మాత్తుగా చౌరస్తాలో ఆగింది. అంతే. హోంగార్డు గుండె అదిరింది. తాను ఏదో తప్పు చేశానని కలవరపడ్డాడు. ఏమైందోనని భయపడిపోయాడు. అంతలోనే చీఫ్ జస్టిస్ కారులో నుంచి దిగారు. హోంగార్డుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇది కలయా? నిజమా? ఊహించని ఈ పరిణామంతో అష్రఫ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతలోనే.. కంగ్రాట్స్.. విధులు బాగా నిర్వహిస్తున్నావ్.. అంటూ ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. విధి నిర్వహణలో హోంగార్డు నిబద్ధతను ప్రతిరోజూ గమనిస్తున్న చీఫ్ జస్టిస్ ఇలా కారు ఆపి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించడం విశేషం.
ఎన్నటికీ మరచిపోలేని రోజు ఇది
శుక్రవారం అకస్మాత్తుగా చౌరస్తాలో హైకోర్టు సీజే కారు ఆగింది. కారు నెమ్మదవుతుండగానే గుండె ధడేల్మన్నది. ఏ తప్పు జరిగిందోనని భయపడ్డా. ఆయన నన్ను పిలిచి బొకే ఇవ్వడంతో ఎంతో సంతోషపడ్డా. డ్యూటీ బాగా చేస్తున్నావు.. అని సీజే అభినందించడంతో అప్పటివరకు ఉన్న భయంపోయింది. నేనేంది..? నన్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అభినందించడం ఏంది..? అని కొన్ని క్షణాలు అర్థం కాలేదు. ప్రధాన న్యాయమూర్తి అభినందించడం నాకు, నా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను సుమారు 23 ఏండ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నా. ఈరోజు నా జీవితంలో ఎన్నటికీ మరువలేను.
-అష్రఫ్ అలీ, హోంగార్డు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

