తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది : బి. వినోద్ కుమార్

హైదరాబాద్ : కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మరణంపై వినోద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితులన్నారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం హరిత ప్రదేశ్ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించిన ఘనులన్నారు. అజిత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్(82) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

