Telangana Budget | దేశం కంటే తెలంగాణ వృద్ధిరేటు అధికం..
యావత్ దేశం వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సంరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు అని చెప్పారు.
హైదరాబాద్: యావత్ దేశం వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సంరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు అని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 11.9 శాతం వృద్ధి రేటు నమోదయిందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ వృద్ధిరేటు 9.1 శాతం మాత్రమేనని వెల్లడించారు. తెలంగాణ వార్థిక బడ్జెట్ను (Telangana Budget) భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
గత ఆర్థిక ఏడాదికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారత దేశ ఆర్థిక రంగం 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతంగా వృద్ధిని నమోదుచేశాయన్నారు. అంటే గతేడాది తెలంగాణ వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు కన్నా తక్కువ అని గమనించాలన్నారు. కాగా, ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుంటే తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుందని తెలిపారు. దీనిని నిలువరించడానికి కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురవాలని పేర్కొన్నారు. దానిని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని, ఆదాయాన్ని సమన్వయ పరిచే చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

