రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
రాయలసీమ ఎత్తిపోతల | ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ర్ట పథకానికి ఎలాంటి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుతులు, నీటి కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల సహా నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు గతంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు కాల్వలకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని, వీటిపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వివరాలను తెలంగాణ ప్రభుత్వం తన లేఖకు జతపరిచింది.
బేసిన్ వెలుపలకు నీటి తరలింపుకే రాయలసీమ ఎత్తిపోతల చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా పనులు చేపట్టకూడదు. ఈ మేరకు గతంలో ఎన్జీటీ ఆదేశాలు ఉన్నాయి. అత్యున్నత మండలి భేటీలో ఎత్తిపోతల అంశం ప్రస్తావించాం. సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చే వరకు పనులు ఆపాలని కేంద్రం చెప్పిందని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

