భారీ వరదలతో రూ.1400కోట్ల నష్టం.. కేంద్రానికి నివేదిక
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో తెలిపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
నష్టం వివరాలు..
వరదల వల్ల కాజ్‌వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.449 కోట్లు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.379కోట్లు. విద్యుత్‌శాఖలో రూ.7కోట్ల నష్టం జరిగినట్లు ఆయాశాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందించాయి.
అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక పంపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
చిట్టెం చొరవతో జూరాల కాలువకు నీటి విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

