రైతు డిస్కమ్‌కు రూ.46,126 కోట్ల అప్పులు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు రేవంత్‌రెడ్డి సర్కార్ భారీ గుదిబండ తగిలించింది. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లకు ఉన్న రూ.62,037 కోట్ల అప్పుల్లో రూ.46,126 కోట్ల అప్పులను రైతు డిస్కమ్ ఖాతాలో వేసింది.
- నెట్వర్, సిబ్బంది, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల బదిలీ
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు రేవంత్‌రెడ్డి సర్కార్ భారీ గుదిబండ తగిలించింది. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లకు ఉన్న రూ.62,037 కోట్ల అప్పుల్లో రూ.46,126 కోట్ల అప్పులను రైతు డిస్కమ్ ఖాతాలో వేసింది. రైతు డిస్కమ్ ఏర్పాటు నేపథ్యంలో ఆస్తుల, అప్పులు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, ఉద్యోగుల బదిలీని సర్కార్ పూర్తిచేసింది. ఈ మేరకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ సోమవారం జీవో 17 జారీచేశారు. దీంతో ఉత్తర డిస్కమ్‌కు రూ.6 వేల కోట్లు, దక్షిణ డిస్కమ్‌కు రూ.17 వేల కోట్లకుపైగా అప్పులు మిగిలాయి.
ఆర్పీడీసీఎల్కు 30,62,853 విద్యుత్తు కనెక్షన్లు బదిలీ చేయడంతోపాటు 27,717 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6,15,651 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించారు. వీటి బుక్ వ్యాల్యూ రూ.2,123.46 కోట్లు ఉంటుందని 5,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లకు టెండర్లు రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగడంతో 5,800 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కొనుగోళ్లకు టీజీ రెడ్కో టెండర్లు ఆహ్వానించింది. ఇందులో 2 వేల మెగావాట్ల సోలార్ (రౌండ్ ది క్లాక్), 3 వేల మెగావాట్లు సోలార్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు కొనుగోలుకు టెండర్లు పిలిచింది. టారిఫ్ అధారిత కాంపిటేటివ్ బిడ్డింగ్ పద్ధతిలో డెవలపర్లను ఎంపిక చేయనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

