ఎకో టూరిజం అభివృద్ధికి కృషి: భట్టి
: రాష్ట్రంలో పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు.
జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ సంజయ్‌జాజు, వివిధ ఐటీ సంస్థల సీఈవోలతో కలిసి అటవీ, పర్యాటకశాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఐటీ రంగంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ ఎకో టూరిజం ప్రాజెక్టులకు మరింత ప్రచారం కల్పించడం, పర్యాటక అవకాశాలను విస్తరించడంపై సమావేశంలో చర్చించారు.
వచ్చే నెల 19 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ : కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సదస్సుకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు చెప్పారు. త్వరలో హైదరాబాద్-విజయవాడ 6+2 లేన్ల రహదారి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

