7 నెలల్లో 50,900 కోట్ల అప్పు!
రాష్ర్టాన్ని అప్పులతో నడపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ మళ్లీ రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పులతో నడపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ మళ్లీ రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది. ఈనెల 19న జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్లను 13 ఏండ్ల కాలపరిమితితో 7.53% వార్షిక వడ్డీకి, మరో రూ.1000 కోట్లను 23 ఏండ్ల కాలపరిమితితో 7.65% వడ్డీకి తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆ ర్బీఐ నుంచి నికరంగా రూ.58,458.71 కోట్ల రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్రెడ్డి సర్కార్.. గత నెల 15 నాటికే రూ.48,900 కోట్ల అప్పులు తెచ్చింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు, రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.27,500 కోట్లు, ఈ నెల 7న మరో రూ.2,500 కోట్ల రుణాలు సమీకరించింది.
మంగళవారం తీసుకునే రూ.2 వేల కోట్లు కూడా కలిపితే అప్పులు రూ.50,900 కోట్లకు చేరుకుంటాయి. తద్వారా వార్షిక లక్ష్యంలో 80 శాతానికిపైగా రుణాలను తొలి 7 నెలల్లోనే సమీకరించినట్టవుతుంది. దీంతో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

