Bharat Bhushan | ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండ.. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు
Bharat Bhushan | ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి కే తారక రామారావు.. హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకున్నారు.
Bharat Bhushan | సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ పాలన సాగిస్తున్నది. ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నది. ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబానికి సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి కే తారక రామారావు.. హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకున్నారు. తద్వారా పెద్ద దిక్కు కోల్పోయిన భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.
సీఎం కేసీఆర్‌కు భరత్‌భూషణ్ కుటుంబం ధన్యవాదాలు
భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో భాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం సీఎం ఆరోగ్య నిధి నుండి ప్రభుత్వం చేయూతనందించింది. కాగా తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య సుభద్రమ్మ, ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
విలక్షణ శైలి భరత్ భూషణ్ సొంతం
భరత్ భూషణ్ విలక్షణమైన శైలికలిగిన తెలంగాణ ఫొటోగ్రాఫర్. ఫోటోగ్రఫీని పెయింటింగ్ లాగా భావించేవారు. 40 ఏండ్ల పాటు వినూత్న శైలితో ఫోటోగ్రఫీలో విశేష సేవలందించిన భరత్ భూషణ్ 1953లో వరంగల్ జిల్లాలో జన్మించారు. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ జీవన స్థితిగతులపై అనేక ఫోటో ప్రదర్శనలిచ్చి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. గొప్ప గొప్ప ఫోటోలు తీసి భద్ర పరిచారు. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో వందలాది ఫోటోలు తీసిన గొప్ప వ్యక్తిగా భరత్ భూషణ్ కీర్తి గడించారు. తెలంగాణ సాంస్కృతిక సామాజిక జీవన చిత్రానికి భరత్ భూషణ్ ఫోటోలు కేరాఫ్ అడ్రస్ అనడంలో అతిశయోక్తి యేమీలేదు. నాలుగు దశాబ్ధాలపాటు కలర్ ఫోటోగ్రఫీలో విశేష ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ ఫొటోలకు కేరాఫ్ భరత్ భూషణ్
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఫోటోలు కావాలనుకుంటే వెంటనే గుర్తుకువచ్చే ఫోటోగ్రాఫర్ పేరు భరత్ భూషణ్. ఏ సందర్భానికి సంబంధించిన ఫోటో కావాలని అడిగినా ఆయన వద్ద దొరికేవి. బతుకమ్మ బోనాలు సహా పలు తెలంగాణ పండుగలు, పల్లె వాతావరణం ముఖ్యంగా నాటి ఇండ్లు, ఇండ్ల దర్వాజలు కిటికీలు సహా తెలంగాణ సాంస్కృతిక జీవన చిత్రాలను ఫోటోలు తీసి భద్రపరిచేవారు. ఎందరో రచయితలు తాము రాసిన పుస్తకాలకు భరత్ భూషణ్ తీసిన ఫోటోలను ముఖ చిత్రాలుగా ప్రచురించుకున్నారు.
తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్‌పై డాక్యుమెంట్
తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్‌ను డాక్యుమెంట్ చేసి తెలంగాణ సంస్కృతిపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను భరత్ భూషణ్ చాటుకున్నారు. 2015 జూన్ రెండో తేదీన జరిగిన తెలంగాణ రాష్ట్ర మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో..‘ది బెస్ట్ ఫోటో జర్నలిస్టు అవార్డు’ అందుకున్నారు. భరత్ భూషణ్ తన జీవిత కాలంలో ఏడు సోలో ఫోటో ఎగ్జిబిషన్లు, ఆరు ఆర్ట్ షోలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
పలు మ్యాగజైన్లకు భరత్ భూషణ్ సేవలు
సహజమైన వెలుగులో లైట్లు లేకుండా ఫోటోలు తీయడం భరత్ భూషణ్ ప్రత్యేకత. ఫోటో జర్నలిస్టుగా అనేక తెలుగు మ్యాగజైన్లకు ఫ్రీలాన్సర్‌గా పనిచేశారు. ఫిల్మ్ మ్యాగజైన్ ‘చిత్రభూమి’, ‘ఆదివారం’ మ్యాగజైన్లకు రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేశారు. చిత్రకారుడైన భరత్ భూషణ్ తెలుగు, ఇంగ్లీష్‌లో పలు వ్యాసాలు కూడా రాశారు. వందల బొమ్మలు గీశారు. సినీ రంగంలోనూ ఆయన సేవలందించారు. 1980 ప్రాంతంలో వచ్చిన ‘మా భూమి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, స్టిల్ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

