హ్యాండ్లూమ్హౌస్లో తెలంగాణకు స్థానం
జాతీయస్థాయి హ్యాండ్లూమ్హౌస్లో తొలిసారిగా తెలంగాణకు ప్రాతినిధ్య దక్కింది. సొసైటీ 70 ఏండ్ల చరిత్రలో రాష్ట్రం నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఓ మహిళ ఎన్నికయ్యారు. గట్జుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఈ ఘనతను సాధించారు.
- జాతీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా గట్టుప్పల్ ‘చేనేత’ చైర్మన్ వజ్రమ్మ
హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయి హ్యాండ్లూమ్హౌస్లో తొలిసారిగా తెలంగాణకు ప్రాతినిధ్య దక్కింది. సొసైటీ 70 ఏండ్ల చరిత్రలో రాష్ట్రం నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఓ మహిళ ఎన్నికయ్యారు. గట్జుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఈ ఘనతను సాధించారు. 1955లో ఏర్పాటైన ఆలిండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మారెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హ్యాండ్లూమ్ హౌస్)లో ఇప్పటివరకూ బోర్డ్ డైరెక్టర్‌గా తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. ఈసారి హ్యాండ్లూమ్ హౌస్ జనరల్‌బాడీ ఎన్నికను నిర్వహించారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి మొత్తంగా 16 చేనేత సహకార సంఘాల ప్రతినిధులకే అవకాశం దక్కింది. అయితే గట్టుప్పల్ చేనేత సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన వజ్రమ్మ సైతం అర్హత సాధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి : వినయ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో అమలవుతున్న వివిధ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అటవీ దళాధిపతి వినయ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌లో బాసర, చార్మినార్, కాళేశ్వరం, రాజన్న, హైదరాబాద్ ఎస్టీసీ సరిళ్ల సీసీఎఫ్లు, సీఎఫ్‌లు, జిల్లా అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2027-28 వన మహోత్సవానికి అవసరమైన మొకల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. అటవీ నేరాల నియంత్రణకు చెక్ పోస్టులు, కలప మిల్లుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ రెస్యూ బృందాలను సమర్థంగా వినియోగించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

