Telangana Genco | హైదరాబాద్ : తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 31వ తేదీన జరగాల్సిన పరీక్షలను జెన్కో వాయిదా వేసింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గమనించాలని సూచించారు.