8 ఖేలో ఇండియా- 2026 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీ’లకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీ’లకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కే రామకృష్ణారావు, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలాదేవి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది యువ క్రీడాకారులు, సహాయక సిబ్బంది రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, రవాణా, క్రీడా మైదానాల సన్నద్ధత తదితర ఏర్పాట్ల ప్రణాళికలు, పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. ఈ క్రీడా సంబురాన్ని అత్యంత ఘనంగా, క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

