ఆవిర్భావ వేడుకలతో ఒకే వేదికపైకి ఎన్నారైలు… బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బిడ్డలను ఆవిర్భావ వేడుకలు ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించేందుకు ప్రవాసులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బిడ్డలను ఆవిర్భావ వేడుకలు ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించేందుకు ప్రవాసులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు మహేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్లీ అలుపెరుగని పోరాటం చేస్తామని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ నాయకుడు శ్రీధర్ గందె తెలిపారు.
అమరుల త్యాగాలు, కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ ఏర్పాటు అని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. లండన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ సిద్ధించిందని బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ తెలిపారు. బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అమెరికాలోనూ జరిగాయి. వెయ్యి మంది తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

