May Day Rajeev Sagar | మహిళా బిల్లుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఓటేయలేదు.. ప్రశ్నించిన రాజీవ్ సాగర్
May Day Rajeev Sagar | లోక్ సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఓటేయలేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.
May Day Rajeev Sagar | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేయలేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆరోపించారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకేం చేస్తుందని ప్రశ్నించారు. మహిళలంటే కాంగ్రెస్ పార్టీ చులనక భావంతో చూస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు సమావేశాల్లో పాల్గొనలేదని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన చిత్తశుద్దిని చాటుకున్నదని రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీల అధినేతలకు లేఖ రాయడం ద్వారా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మద్దతు కూడగట్టిందని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడలేదని రాజీవ్ సాగర్ దుయ్యబట్టారు. లోక్‌సభలో బిల్లు ఓటింగ్‌కు వచ్చినపపుడు దొడ్డిదారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. గతంలోనూ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మహిళలకు గృహలక్ష్మి పేరుతో రూ.2500 ఇస్తామని చెబితే ఎలా నమ్ముతారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నీటిమీద రాతలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

