May Day Rajeev Sagar | పసుపు బోర్డు ప్రధాని మోదీ ఎన్నికల హామీ మాత్రమే.. మేడే రాజీవ్ సాగర్ ఎద్దేవా
May Day Rajeev Sagar | మహబూబ్ నగర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ‘పసుపు బోర్డు’ హామీ కేవలం ఎన్నికల హామీ మాత్రమేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఎద్దేవా చేశారు.
May Day Rajeev Sagar | మహబూబ్ నగర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఎన్నికల హామీలే తప్ప నేరవేరే హామీలు కావని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు సైతం రావని తెలిసే ఇప్పుడు పసుపు బోర్డు పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఏరు దాటే దాక ఓడ మల్లన్న..ఏరు దాటినంక బోడ మల్లన్న అన్నట్టు ఎన్నికల తరువాత తెలంగాణ ప్రజలను ఈ టూరిస్టు నేతలు పట్టించుకోరని మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు మీద రోజుకో మాట మాట్లాడే బీజేపీ నేతలు పసుపు బోర్డు పాల అంబాసిడర్ కారు లాంటి స్పైసీ బోర్డు తెస్తామన్నారని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఉండడంతో రైతుల ఓటు బ్యాంకు కోసం మళ్లీ పసుపు బోర్డు పేరుతో కొత్త నాటకానికి తెర తీసారని విమర్శించారు. ఎన్ని దొంగనాటకాలు ఆడిన నిజామాబాద్ పసుపు రైతులే దగ్గరుండి దొంగనాటకాలు ఆడుతున్న అరవింద్‌ని ఇంటికి పంపిస్తారని స్పష్టం చేశారు.
2014 విభజన హామీ గిరిజన యూనివర్సిటీ పదేండ్ల తరువాత ప్రకటించారని మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. గిరిజన యూనివర్సిటీ గురించి తెలంగాణ సర్కార్ ఎన్ని సార్లు అడిగినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. 2014లో ఎన్నికల్లో అదే మహబూబ్ నగర్ గడ్డ మీద నుంచి పాలమూరు గురించి మాట్లాడిన మోదీ ఇప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
2015లో బీహార్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకెజీ అని వాగ్దానాలు ఇచ్చిన మోడీ ఎనిమిదేండ్లు దాటినా ఆ హామీకి దిక్కు మొక్కు లేదన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో సభలు పెట్టి అమలు కానీ వాగ్దానాలు ఇవ్వడం మోడీకి వెన్నతో పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

