Rajiv Sagar | ఓటమి భయంతోనే దర్యాప్తు సంస్థలతో దాడులు : మేడే రాజీవ్ సాగర్
Rajiv Sagar | ఓటమి భయంతోనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ విషయంపై ఖమ్మం సభలో ప్రజలు నిలదీస్తారని తెలిసే అమిత్ షా సభను రద్దు చేసుకున్నారన్నారు.
Rajiv Sagar | ఓటమి భయంతోనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ విషయంపై ఖమ్మం సభలో ప్రజలు నిలదీస్తారని తెలిసే అమిత్ షా సభను రద్దు చేసుకున్నారన్నారు. వారి మాట వినని, బీజేపీ పార్టీలోకి వెళ్లని నేతపై దర్యాప్తు సంస్థలు దాడులు జరిపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడరని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణలో వారి ఆటలు సాగవని హెచ్చరించారు.
బీజేపీయేతర రాష్ట్ర సర్కారులను ఇబ్బంది పెట్టేందుకే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించారని మండిపడ్డారు. విచారణ అంటూ హడావిడి చేసి దర్యాప్తు సంస్ధ దాఖలు చేసిన చార్జిషీట్లో పేరు లేదన్నారు. తెలంగాణతో పాటు విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కావాలనే దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ కపట నాటకాలు అర్థమయ్యాయని, రానున్న ఎన్నికల్లో వారికి తప్పకుండా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

