ఆన్లైన్ ఆడిట్లో మళ్లీ మనమే టాప్

- 3,636 పంచాయతీల్లో ప్రక్రియ పూర్తి
- ఇంకా ఆడిట్ ప్రారంభించనిపలు రాష్ర్టాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్లైన్లో ఆడిట్‌చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. హిమాచల్ ప్రదేశ్ (236), రాజస్థాన్ (144), కర్ణాటక (106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 10 రాష్ర్టాలు మాత్రమే ఆన్లైన్ ఆడిటింగ్‌ను ప్రారంభిచాయి. మిగతా రాష్ర్టాలు ఇంకా మొదలు పెట్టలేదు. దేశంలో మొత్తం 2,55,236 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 4,684 గ్రామాల ఆడిటింగ్ పూర్తయింది. ఇందులో 78 శాతం తెలంగాణవే కావడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఎలా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ఆడిటింగ్ వీలుకల్పిస్తున్నది.
మొదటి నుంచే అగ్రస్థానంలో తెలంగాణ
అన్ని గ్రామాలను ఆన్లైన్ ఆడిటింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. రాష్ట్రంలో 5,174 పంచాయతీలను ఆన్లైన్లో ఆడిట్ చేసి 56,505 అభ్యంతరాలను పంచాయతీలకు పంపారు. తద్వారా దేశంలో మొదటి స్థానంలో నిలిచారు. వాస్తవానికి గతేడాది 25 శాతం గ్రామాలనే ఆడిట్ చేయాలని కేంద్రం సూచించింది. తెలంగాణ అధికారులు దాదాపు 40 శాతం గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తిచేశారు. దీంతో అనేక రాష్ర్టాలు తెలంగాణకు వచ్చి ఆన్లైన్ ఆడిటింగ్ విధానంపై అధ్యయనం చేశాయి. కొన్ని రాష్ర్టాలు కనీసం ఆడిటింగ్‌ను కూడా మొదలు పెట్టకపోవడంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గతేడాది అన్ని రాష్ర్టాల ఆడిట్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. మోదీ సర్కార్ విన్నపం మేరకు తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది సైతం తెలంగాణ అధికారులు జూన్ నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేశారు. ఫలితంగా దేశంలోని అన్ని రాష్ర్టాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

