ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష!
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టే ఫైర్మన్లు ప్రమోషన్లు పొందాలన్నా, ఇంక్రిమెంట్లు తీసుకోవాలన్నా హెచ్వీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే నిబంధన మేరకు నిరుడు ప్రభుత్వం జీవో-89 తీసుకొచ్చింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఫైర్‌మన్‌గా, లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
- హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు
- విధులను వదిలేసి ఆర్టీఏ
- కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
- ప్రాణాలు తెగించి పోరాడుతున్నా పట్టించుకోని అగ్నిమాపకశాఖ
- సర్కార్ తీరుతో తీవ్రంగా విసిగిపోయామంటున్న ఫైర్మన్లు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అగ్నిమాపకశాఖలో ఫైర్మన్లు కొత్త పరీక్షలు ఎదుర్కొంటున్నారు. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పేరిట విధులు వదిలి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టే ఫైర్మన్లు ప్రమోషన్లు పొందాలన్నా, ఇంక్రిమెంట్లు తీసుకోవాలన్నా హెచ్వీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే నిబంధన మేరకు నిరుడు ప్రభుత్వం జీవో-89 తీసుకొచ్చింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఫైర్‌మన్‌గా, లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నదని వాపోతున్నారు. సీనియార్టీని పక్కనబెట్టి, నిస్వార్థ విధినిర్వహణను కాలదన్ని.. ఇలా ఏకపక్షంగా జీవోలు తేవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమను ప్రభుత్వం ఇలా అవమానిచండం సరికాదని మండిపడ్డుతున్నారు. ఈ విషయంపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
హక్కులను కాలరాస్తున్న అగ్నిమాపకశాఖ
ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఇంక్రిమెంట్లు, విధి నిర్వహణలో పనికి తగిన గుర్తింపుతో వచ్చే పదోన్నతుల హక్కులను అగ్నిమాపకశాఖ కాలరాస్తున్నట్టు ఫైర్మన్లు చెప్తున్నారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే ఆ ప్రాంతానికి మొదటగా చేరుకుని మంటలు అదుపు చేయడం, మంటల్లో చికుకున్నవారిని రక్షించడం, ఇతర సహాయక చర్యలు చేపట్టడం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన బాధ్యతలు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఫైర్మన్లు పనిచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అని చెప్పడం తీవ్ర అన్యాయమని వాపోతున్నారు. కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నప్పటికీ హెవీ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయాలు, శిక్షణ కేంద్రాల చుట్టూ తిరుగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రజల రక్షణ కోసమే నిబంధనలు..
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు డ్రైవర్లు అందుబాటులో లేని సమయంలో ఫైర్మన్లు తప్పనిసరిగా వాటర్‌తో వెళ్లే హెవీ వెహికిల్స్‌ను డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. వారు భారీ వాహనాలతో సందుగొందుల్లోంచి వెళ్లే సమయంలో ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతోనే జీవో-89 తీసుకొచ్చామని చెప్తున్నారు. అగ్నిమాపకశాఖలో భారీ ఫైర్ వెహికిల్స్, నీటి ట్యాంకర్లు, హైడ్రాలిక్ పరికరాలు, రక్షణ సామగ్రిని మోసుకొచ్చే వాహనాల వరకు అన్నింటికీ శిక్షణ ఇస్తున్నట్టు చెప్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి తక్షణమే స్పందించేందుకు తగిన సంఖ్యలో ఉద్యోగులు అందుబాటులో ఉండాలనేది తమ ఉద్దేశమని, ప్రజల ప్రాణాలు రక్షించేందుకే ఈ నిబంధలు తీసుకొచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

