విద్యుత్తు సంస్థలు.. ముందే హెచ్చరించినా.. సర్కార్ బేఖాతర్
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తారస్థాయికి చేరింది. విద్యుదుత్పత్తి తగ్గిపోగా.. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి.
- సంక్షోభాన్ని అంచనా వేసినా ఉదాసీనత
- దిద్దుబాటు చర్యలు చేపట్టని ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తారస్థాయికి చేరింది. విద్యుదుత్పత్తి తగ్గిపోగా.. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి. పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటింది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై ట్రాన్స్‌కో, జెన్కోలు ఎప్పటికప్పుడు సర్కార్‌కు నివేదిస్తున్నా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది.
ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న అన్నిరకాల అవకాశాలను రాష్ట్రం కోల్పోయినట్టు చెప్తున్నారు. అతి తక్కువ ధరలో వి ద్యుత్తును ఉత్పత్తిచేసి, విజయవంతంగా రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత జెన్కో సొంతం. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఒక్క కొత్త విద్యత్తు ప్రాజెక్ట్‌ను కూడా కట్టలేదు. ఒక మెగావాట్ విద్యుత్తు సామర్థ్యాన్ని అదనంగా జోడించలేదు. కానీ హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ అంటూ పక్క రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో తొలి సోలార్ ప్లాంటు జెన్కోదే.
జూరాలలో ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను జెన్కో నిర్మించింది. ఆ తర్వాత సోలార్ విద్యుత్తుపై జెన్కో దృష్టిసారించలేదు. పెద్దపల్లిలో 2.2 మెగావాట్లు, క్యాప్టివ్ పవర్ కింద 0.3 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు మాత్రమే జెన్కో చేపట్టింది. గతంలో పులిచింతల, నిజాంసాగర్, పెద్దపల్లిలో కెనాల్స్ మీద సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. కేటీపీఎస్‌లో 8 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ ఈ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ప్రైవేట్ ప్లాంట్లు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. అవి మన రాష్ర్టానికే విద్యుత్తును విక్రయిస్తున్నాయి. చివరికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కూడా సోలార్, ఫ్లోటింగ్ సోలార్ రంగంలో ప్రవేశించి ప్లాంట్లు నెలకొల్పింది. కానీ జెన్కో మాత్రం ఈ దిశలో ముందడుగువేయలేదు.
బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ
దేశమంతా.. బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల యుగం నడుస్తున్నది. ఈ రంగంలో కూడా జెన్కో ప్రవేశించలేదు. 1500 మెగావాట్ల బ్యాటరీ ప్రాజెక్ట్‌ను కేంద్రం మంజూరుచేసింది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.240 కోట్లు కేటాయించింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటుచేయాల్సి ఉండగా, జెన్కో రెడీ అయ్యింది. కానీ జెన్కోను తప్పించి రెండు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. జనగామ, మహేశ్వరంలోని ట్రాన్స్‌కోకు చెందిన స్థలాల్లో టీజీ జెన్కో ద్వారా వీటిని ఏర్పాటుచేయాలని భావించారు. అయితే ఇది కూడా పట్టాలెక్కలేదు. ఇక నాగార్జునసాగర్‌లో పంప్డ్‌స్టోరేజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. సాగర్ దిగువన 100 – 120 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చని అధికారులు తేల్చారు. ఆఖరుకు ఇది కూడా మూలన పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

