డిస్కంల తొందరపాటు!
‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్టు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల వ్యవహారం ఉన్నది. కొత్తగా విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో డిస్కంల తొందరపాటు విషయం వెలుగు చూసింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే విద్యుత్తు కొనుగోళ్లకు డిసంలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొత్తగా 13,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి.
- సర్కార్ అనుమతికి రాకముందే కొనుగోళ్లకు ప్రయత్నాలు
- 13,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లకు దక్షిణ డిస్కం ప్రతిపాదనలు
- గతనెల 30న ఈఆర్సీకి దరఖాస్తు.. ఈ నెల 6న ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్టు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల వ్యవహారం ఉన్నది. కొత్తగా విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో డిస్కంల తొందరపాటు విషయం వెలుగు చూసింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే విద్యుత్తు కొనుగోళ్లకు డిసంలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొత్తగా 13,800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి.
ప్రభుత్వ అనుమతి తర్వాతే ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉండగా, అనుమతికి ముందే డిస్కంలు ఈఆర్సీని ఆశ్రయించడం గమనార్హం. గత 30న ఈఆర్సీకి డిస్కంల తరఫున దక్షిణ డిస్కం పిటిషన్ సమర్పించగా, అక్టోబర్ 1న ఆ పిటిషన్‌ను ఈఆర్సీ స్వీకరించింది. విద్యుత్తు కొనుగోళ్లకు ప్రభుత్వం మాత్రం అక్టోబర్ 6న అనుమతినిచ్చింది. నాలుగు వేర్వేరు జీవోలను ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ నవీన్‌మిట్టల్ విడుదల చేశారు. విద్యుత్తు కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే డిస్కంలు ఈఆర్సీ అనుమతి కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతికి ముందే పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
25 ఏండ్లకు కొనుగోళ్లపై అనుమానాలు
విద్యుత్తు కొనుగోళ్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వం టీజీ రెడ్కోకు బాధ్యతలు అప్పగించింది. ఒకేసారి 25 ఏండ్లకు విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతినిచ్చిన ఒప్పందం వెనుక భారీ తతంగం దాగి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్తు ధరలు, డిమాండ్ అంచనాలు నిరంతరం మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి పాతికేండ్లు ఒప్పందాలు కుదుర్చుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితి మారితే రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని విద్యుత్తు రంగం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్తు వినియోగం తగ్గితే ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
రెండు విధానాల ఎంపిక
పీక్ విద్యుత్తు డిమాండ్ సమయంలో నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు డిస్కంలు రెండు కొత్త విధానాలను ఎంచుకున్నాయి. అవే రౌండ్ ది క్లాక్ రెన్యువల్ ఎనర్జీ (ఆర్ఈ ఆర్టీసీ), పీక్ ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యువబుల్ ఎనర్జీ (ఎఫ్డీఆర్ఈ). ఈ రెండు కూడా సోలార్, పవన, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తుల మేళవింపు. సోలార్, విండ్ పవర్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా పవర్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ విధానంలో సోలార్, విండ్పవర్ను బ్యాటరీల్లో నిల్వచేసి పీక్ అవర్స్‌లో అందించడం వీటి ప్రత్యేకత. విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో (ఉదయం, సాయంత్రం) డిస్కంలకు కచ్చితమైన, నమ్మకమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఈ కొత్త మాడల్ సహాయపడుతుంది. ఒప్పందం చేసుకున్న వారికి ఉత్పత్తిదారులు 90శాతం విద్యుత్తును అందించాల్సి ఉంటుంది. గ్రిడ్ స్థిరత్వం కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఈ మాడల్‌ను అనుసరిస్తున్నాయి.
రంగం : మెగావాట్లు
పవన విద్యుత్తు (విండ్) : 800
సోలార్ : 3,000
బ్యాటరీ : 6,000
రెన్యువబుల్ (రౌండ్‌దిక్లాక్) : 2,000
పీక్ ఎఫ్డీఆర్ఈ : 2,000
మొత్తం : 13,800
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

