e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home తెలంగాణ కేసీఆర్‌ తెలంగాణ దేవుడు

కేసీఆర్‌ తెలంగాణ దేవుడు

కేసీఆర్‌ తెలంగాణ దేవుడు

మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌
‘తెలంగాణ దేవుడు’ ప్రీ రిలీజ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణను సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ కచ్చితంగా తెలంగాణ దేవుడేనని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. శ్రీకాంత్‌, సంగీత, జిషాన్‌ ఉస్మాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. వడత్యా హరీశ్‌ దర్శకత్వం వహించారు. మహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలకానున్నది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ‘తెలంగాణ దేవుడు’ అనే టైటిల్‌ను పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణను సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ కచ్చితంగా తెలంగాణ దేవుడే. సినిమా చూసిన తర్వాత కళ్లలో నీళ్లొచ్చాయి. గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు’ అని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చా రు. ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రజలు కేసీఆర్‌గారిని దేవుడిలా పూజిస్తున్నారు. అసమాన పోరాట పటిమ, త్యాగాలతో, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ప్రజాభీష్టం మేరకు సీఎం పదవిని చేపట్టి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారు. కేసీఆర్‌ విజన్‌ వల్లే అది సాధ్యమైంది. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ మారిపోయింది. కేసీఆర్‌ గొప్ప మానవతావది, నాయకుడు, పోరాటయోధుడు. భోళాశంకరుడు’ అని పేర్కొన్నారు.

Advertisement
కేసీఆర్‌ తెలంగాణ దేవుడు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement