Telangana | తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మారుస్తూ ఉత్తర్వులు
Telangana | 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది.
Telangana | 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. అయితే ఎంసెట్ పేరును ఉన్నత విద్యామండలి మార్చింది. టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నారు. ఇక టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ ప్రవేశ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు.
బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జరగనుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది. 3 ఏండ్ల న్యాయవిద్య, 5 ఏండ్ల లా కోర్సులో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్.. జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. అదే రోజు… ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా నిర్వహించనున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుంది. ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష… జూన్ 6 నుంచి 8 తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్టును శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

