CM with Collectors | రేపు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ
CM with Collectors | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ భాగంలోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగనుంది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ భాగంలోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగనుంది.
సుదీర్ఘంగా జరగనున్న ఈ సమావేశంలో పరిపాలనాపరమైన అంశాలు, కీలక సమస్యలతోపాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు, ఆరు గ్యారంటీలపై చర్చించనున్నారు. ఆదాయ వనరులు తదితర అంశాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
సదస్సు ఎజెండాను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

