Rs 500 Bonus | సన్న వడ్లకే రూ.500 బోనస్.. ప్రకటించిన మంత్రి పొంగులేటి
Rs 500 Bonus | వచ్చే సీజన్ నుంచి సన్న వండ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది.
Rs 500 Bonus | వచ్చే సీజన్ నుంచి సన్న వండ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. అనంతరం సమావేశం నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వివరించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ సీజన్లో 36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశామన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన మూడురోజుల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామన్నారు. ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటాకు రూ.500 ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్ చేస్తామని.. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీధర్‌బాబు బాబు కమిటీ వేశామన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్‌లో నీటి నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
బ్యారేజ్‌ల సేఫ్టీపై ఎక్స్పర్ట్ కంపెనీలతో పరిశీలన చేయించి రిపోర్ట్ తీసుకుంటామన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరమ్మతులు చేపడుతామన్నారు. తక్కువ ఖర్చుతో నీటిని లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు సోనియా గాంధీతో పాటు తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఆహ్వానిస్తామన్నారు. వేడుకల నిర్వహణకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

