Budget | ముగిసిన క్యాబినెట్ సమావేశం.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించింది.
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడుతారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సమవేశమైన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కాగా, ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. అయితే ఇది గత బడ్జెట్ కంటే 20 వేల కోట్లు తక్కువ.
ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది. ఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

