వచ్చే 15రోజులు ఉష్ణోగ్రతలు.. తారస్థాయికి 16 నుంచి 20 పలు జిల్లాల్లో వేడిగాలులు
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 15 రోజుల్లో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా ఈనెల 16 నుంచి 20వరకు మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తాయని వివరించింది.
అదేవిధంగా రాబోయే రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువవచ్చని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

