మెడిసిన్ హబ్ తెలంగాణ

కరోనా మందుల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే
దేశ అవసరాల్లో 25-30 శాతం ఇక్కడినుంచే సరఫరా
డిమాండ్ పెరగడంతో తగ్గిన ముడిసరుకు లభ్యత
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్లు, విటమిన్ ట్యాబెట్లు, జ్వరం గోలీలు.. ఇలా కరోనా చికిత్సకు అవసరమైన అన్ని మందులూ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి. దేశ అవసరాల్లో దాదాపు 25 నుంచి 30 శాతం తయారుచేస్తూ రాష్ట్రం మెడిసిన్ హబ్‌గా మారింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తూ ఇప్పటికే ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకున్న హైదరాబాద్.. త్వరలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ టీకాను ఉత్పత్తి చేయనున్నది. మలేరియా మొదలుకొని పలురకాల వ్యాధులకు ఇక్కడే వ్యాక్సిన్ అభివృద్ధి జరిగింది. కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న టోసిలిజుమాబ్ మినహా ఇతర మందులన్నీ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి. టోసిలిజుమాబ్ ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నది. రెమ్డెసివిర్సహా వివిధ రకాల విటమిన్ ట్యాబ్లెట్లు, జ్వరం మాత్రలు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలకు ఉపయోగిస్తున్న మందులన్నీ మనవద్దే ఉత్పత్తి అవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో మందుల ఉత్పత్తి జరుగుతు న్నా.. దేశ అవసరాల్లో 25 నుంచి 30 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయి. మందుల తయారీ ఎక్కడ జరిగినా వాటి ఉత్పత్తి, సరఫరాపై కంట్రోలింగ్ మాత్రం కేంద్రప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. రాష్ర్టాల అవసరాలను బట్టి కేంద్రమే మందులను సరఫరా చేస్తుంటుంది.
భారీగా పెరిగిన ముడిసరుకు ధరలు
మందుల తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.150-200కి కిలో లభించే ముడిసరుకు ఇప్పుడు ఏకంగా రూ.750-800కి పెరిగింది. ముడిసరుకు తెలంగాణతోపాటు, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో ఉత్పత్తి అవుతున్నది. మందుల్లో ఉపయోగించే ప్రధానమైన మిశ్రమం చైనా నుంచి కూడా దిగుమతి అవుతున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా మందులకు గిరాకీ పెరగడంలో ముడిసరుకు సరఫరా తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగిపోయాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
మందుల పరిశోధనల్లో మనమే ముందు
మందుల తయారీతోపాటు పరిశోధనల్లోనూ తెలంగాణ ముందువరుసలో ఉన్నది. కరోనా చికిత్సకు వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్, డెక్సామెథాసోన్, యాంటీబయాటిక్, విటమిన్ ట్యాబ్లెట్లు తదితరాలన్నీ రాష్ట్రంలోనే ఉత్పత్తవుతున్నాయి. త్వరలోనే ఇతర దేశాల వ్యాక్సిన్లు రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఈ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయి.
– ఎస్కె. జానిమియా, అధ్యక్షుడు,
తెలంగాణ ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

