13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి తెలంగాణలో ఈ నెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు రక్షణశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
- తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులకు అవకాశం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి తెలంగాణలో ఈ నెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు రక్షణశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వేదికగా ఈ ర్యాలీ జరుగనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణులు), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణులు) విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 2027 సంవత్సరానికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అడ్మిట్‌కార్డులు పొందిన అభ్యర్థులు మాత్రమే సంబంధిత తేదీల్లో ర్యాలీకి హాజరుకావాలని సూచించారు. నోటిఫికేషన్లో సూచించిన అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని ఆర్మీ అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం www. joinindianarmy.nic.inను సందర్శించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

