డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి జిల్లా, మోతూర్ మండలంలోని అన్నాజీపురం-తిరుమలగిరి రోడ్డు సమీపంలో కొనసాగుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా, మోతూర్ మండలంలోని అన్నాజీపురం-తిరుమలగిరి రోడ్డు సమీపంలో కొనసాగుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ ప్రమాదంలో తన సిబ్బందితో పాటు మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని పేరొన్నారు. ప్రమాదం అనుమానాస్పదంగా ఉన్నదని వినతిపత్రంలో పేరొన్నారు. తనను హత్య చేయడమే లక్ష్యంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

