పౌల్ట్రీ, డెయిరీలకు ఆస్తి పన్ను మినహాయింపు

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ): పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్నును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి బుధవారం వేర్వేరుగా ఆదేశాలు జారీచేశారు. పట్టణాలు, నగరాలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీలకు ఆస్తు పన్నును మినహాయించారు. కనీస పన్నుగా సంవత్సరానికి రూ.100 చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా వందలమంది పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు ఎంతో మేలు జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పన్ను మినహాయింపుపై సీఎం కేసీఆర్కు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

