Auto Strike | రేపు ఆటో బంద్.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
Auto Strike | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్' వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
- విజయవంతం చేయాలి
- ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం
- టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక
Auto Strike | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి14 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచితబస్సు పథకంలో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆటోలకు స్టిక్క ర్లు అంటించి బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో శాతం రమేశ్, నిరంజన్, రామాంజనేయులు, సీహెచ్ సాయికుమార్, ఎర్రం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

