తొలిమెట్టు పర్యవేక్షణకు ‘టాంగరిన్’
పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
- సీఎస్ఎఫ్ సహకారంతో రూపకల్పన
- 19 నుంచి అందుబాటులోకి..
- పరీక్షించనున్న విద్యార్థుల ప్రగతి
- ఇంటర్నెట్ లేకుండానే వినియోగం
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు టాంగరిన్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఫౌండేషన్ లిట్రసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిమెట్టుగా ప్రవేశపెట్టారు. విద్యార్థులు కనీస సామర్థ్యాల సాధనే దీని ముఖ్యమైన పని. సెంట్రల్ స్కైయర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్) రూపొందించిన టాంగరిన్ యాప్‌ను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తేనున్నది.
ఈ యాప్ వినియోగంపై రాష్ట్రస్థాయిలో 602 నోడల్ అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లకు ఇటీవలే శిక్షణ ఇచ్చారు. తాజాగా గురువారం అన్ని మండలాల నోడల్ అధికారులు, క్లస్టర్ నోడల్ అధికారులు, రిసోర్స్ పర్సన్లు శిక్షణ పొందారు. సోపానాల ప్రకారం బోధన కొనసాగుతున్నదా?, సూక్ష్మ సామర్థ్యాలు సాధించారా? లేదా అన్నది యాప్ సహకారంతో పర్యవేక్షిస్తారు. మండల, క్లస్టర్ నోడల్ అధికారులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరీక్షిస్తారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తద్వారా ఆయా వివరాలను యాప్‌లో అప్లోడ్ చేస్తారు.
యాప్ విశేషాలు
- ఇంటర్నెట్ అవసరం లేకుండా టాంగరిన్ యాప్‌ను వినియోగించవచ్చు.
- నోడల్ అధికారి, రిసోర్స్పర్సన్లు యాప్‌లోని ప్రశ్నపత్రాల ఆధారంగా అక్కడికక్కడే విద్యార్థులు సాధించిన సామర్థ్యాలను నమోదుచేస్తారు.
- ఈ యాప్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి అందరూ ఓపెన్ చేసి చూడవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CSF
- FLN
- monitoring
- Tangerine app
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

