Tadoba Forest | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవి అందాలను గురించి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్’లో మంగళవారం తన స్నేహితుడొకరు తీసిన ఓ వీడియోలో ప్రకృతి సహజ సౌందర్యాన్ని బంధించాడు అని పేర్కొన్నారు.
ఒక గంభీర పులి పసందైన విందును ఆరగించి, పక్కనే చెరువులో మునిగి హుందాగా సేదదీరింది.. అని వివరించారు. తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో తన స్నేహితుడి సాహసాలను అసూయతో స్క్రోల్ చేస్తున్నానని తెలిపారు. ‘కాంట్ వెయిట్ ఫర్ ద ఫుల్ డీబ్రీఫ్ అండ్ జా డ్రిప్పింగ్ స్నాప్షాట్స్’ అంటూ తన ట్వీట్‌ను ముగించారు.