T-SAT | రేపటి నుంచి టెట్ పై టి-సాట్ స్పెషల్ లైవ్ లెసన్స్ : శైలేష్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) కోసం
పోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జూన్ ఐదో తేదీ వరకు రెండు నెలలు 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో శైలేష్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండో పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు టి-సాట్ విద్య ఛానల్ లో ప్రసారాలు ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయన్నారు.
సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండో ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక ప్రత్యక్ష (స్పెషల్ లైవ్ లెసన్స్) ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు. ఏప్రిల్ 4 నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఉపన్యాసకులచే అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవల్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు.
ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారమౌతాయన్నారు. మాక్ టెస్ట్ లు, క్విజ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులతో కలిపి సుమారు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిందని, ఆ ఉద్యోగాల సాధనలో తెలంగాణ యువతకు చేయూత నిచ్చేందుకు టి-సాట్ నెట్వర్క్ తన వంతు సహకారం అందిస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు.
పోటీ పరీక్షల అవగాహన తరగుతులతో పాటు మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి టి-సాట్ వెబ్ సైట్, ఛానళ్లు, యూట్యూబ్ ద్వార అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. టి-సాట్ మాక్ టెస్ట్ లో భాగస్వాములవడం వలన ప్రభుత్వం నిర్వహించబోయే తుది పరీక్షనెదుర్కోవడం సులభమౌతుందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

