స్టార్టప్‌ల పుట్టినిల్లు టీ-హబ్.. యువత ఆలోచనలకు వాస్తవరూపం
టీ-హబ్.. స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్. యువత ఆలోచనలకు, వినూత్న ఆవిష్కరణలకు వేదిక. మంత్రి కేటీఆర్ సంకల్పానికి ప్రతిరూపమైన టీ-హబ్ తన ఏడేండ్ల ప్రస్థానంలో చెక్కుచెదరని విజయాలను నమోదు చేసింది
- అంకురాలకు అమ్మ.. ఆవిష్కరణలకు పట్టుగొమ్మ
- మంత్రి కేటీఆర్ సంకల్పానికి ప్రతిరూపం
- ప్రపంచంలోనే రెండో పెద్ద స్టార్టప్ హబ్
- దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్
- దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి
టీ-హబ్.. స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్. యువత ఆలోచనలకు, వినూత్న ఆవిష్కరణలకు వేదిక. మంత్రి కేటీఆర్ సంకల్పానికి ప్రతిరూపమైన టీ-హబ్ తన ఏడేండ్ల ప్రస్థానంలో చెక్కుచెదరని విజయాలను నమోదు చేసింది. దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గానే కాదు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది.
(బరిగెల శేఖర్)
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): టీ హబ్.. మనదేశంలో స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్. ఏడేండ్లలోనే అంతర్జాతీయంగా అనేక సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్‌ల ఫ్యాక్టరీ. స్టార్టప్‌లకు అత్యంత అనుకూల వాతావరణం (స్టార్టప్ ఎకో సిస్టం) కల్పించడంలో దేశంలో టీ-హబ్ ప్రథమ స్థానంలో ఉన్నది. 2015, నవంబర్ 5న ప్రారంభమైన టీ-హబ్ నిర్విరామంగా యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. టీ హబ్ ఇంతటి ఘన విజయానికి వెన్నెముకగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవ, శ్రద్ధతో రాష్ట్రంలో సాంకేతిక విప్లవం సరికొత్త పుంతలు తొక్కుతున్నది. ఆయన దృఢ సంకల్పమే టీ హబ్‌ను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్‌గా నిలిపింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ నడిబొడ్డున మూడెకరాల వైశాల్యంలో పది అంతుస్థుల్లో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమైన టీ-హబ్‌లో ప్రస్తుతం ఐదు అంతస్థుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆరు, ఏడు అంతస్థుల్లో కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలకు ముందస్తు బుకింగ్స్ పూర్తయినట్టు టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతస్థులవారీగా కొనసాగుతున్న కార్యకలాపాలు, ఏర్పాట్లను ఓసారి పరిశీలిస్తే…
టీ హబ్‌లో కార్యకలాపాలు ఇలా
గ్రౌండ్ ప్లోర్

l విస్తీర్ణం 15 వేల చరదపు అడుగులు
l రెండు బ్యాంకులకు స్థలం కేటాయింపు
l కాఫీషాప్, విజిటర్స్ లాంజ్
l రిసెప్షన్
మొదటి అంతస్థు

l విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులు
l ఎక్స్పీరియన్స్ సెంటర్
l డిజిటల్ స్టూడియో, సినీప్రెన్యూర్
l స్టార్టప్‌ల కార్యకలాపాలు
రెండవ అంతస్థు

l విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులు
l ఎంబసీ ఆఫీస్ (విదేశాల నుంచి వచ్చే రాయబారుల కోసం ప్రత్యేక ఆఫీస్ క్యాబిన్లు)
l ఇన్వెస్టర్స్ ఆఫీస్ (స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు ఉండేందుకు, స్టార్టప్‌లతో
సమావేశాలు నిర్వహించేందుకు సమావేశ మందిరాలు)
l స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహణకు ప్రత్యేక స్థలం
మూడో అంతస్థు

l విస్తీర్ణం 50 వేల చదరపు అడుగులు
l స్టార్టప్ జోన్
l కొలాబరేషన్ జోన్
l మీటింగ్ రూమ్స్
l టీ హబ్ ప్రధాన కార్యాలయం
l సీఈవో కార్యాలయం, బోర్డు రూం, జిమ్
l సీఐఐ ఆఫీస్ (భారతీయ పరిశ్రమల సమాఖ్య)
l తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)
l రిసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)
l ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
l కార్పొరేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)
నాలుగో అంతస్థు

l విస్తీర్ణం 50 వేల చదరపు అడుగులు
l సమావేశ గదులు
l స్టార్టప్ జోన్స్
l కొలాబరేషన్ జోన్
ఐదో అంతస్థు

l 50 వేల చదరపు అడుగులు
l ఈవెంట్ హాల్
l కెఫెటేరియా, ఎగ్జిక్యూటివ్ డైనింగ్
l క్యాజువల్ సీటింగ్
మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చేవి
ఆరో అంతస్థు
l విస్తీర్ణం 50 వేల చదరపు అడుగులు
l 18,000 చదరపు అడుగుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కార్యాలయం
l 10 వేల చదరపు అడుగుల్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్
l కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలు
ఏడో అంతస్థు
l విస్తీర్ణం 50 వేల చదరపు అడుగులు
l కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

