హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రెడ్‌బెర్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అమెరికాలోని చికాగోలో టీ-హబ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. స్టార్టప్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ‘గ్లోబల్ కనెక్ట్ ఇండియా-యూఎస్ఏ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్ బెర్రీ కార్పొరేషన్ కలిసి పనిచేస్తున్నట్టు టీ- హబ్ నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్‌లకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు రెడ్బెర్రీతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తూ స్టార్టప్‌లు రూపొందించే ఉత్పత్తులను విదేశాల్లోనూ విరివిగా ఉపయోగించేందుకు ఇది వేదికగా మారనుందని పేర్కొన్నారు.