బోసి నవ్వుల బోధిసత్వుడు
బోసి నవ్వుల బోధిసత్వుడు పోరుబందరు పోరు బిడ్డడు
బోసి నవ్వుల బోధిసత్వుడు
పోరుబందరు పోరు బిడ్డడు
మోహమెరుగనీ మోహన్దాసుడు
భోగం కోరని సాధుపురుషుడు
సత్యాగ్రహ ప్రవక్త గాంధీ
స్వాతంత్య్ర ప్రదాత గాంధీ
భారతీయతే తన జీవనము
భగవద్గీతే తన భావనము
సాత్వికతే తన తాత్వికతా
సహనశీలమే సార్థకతా
॥ సత్యాగ్రహ ప్రవక్త ॥
సత్యాహింసలె శస్త్రాస్త్రాలుగ
సమరం నడిపించాడు
ఉపవాసదీక్షతో సామ్రాజ్యాన్నే
గజగజ వణికించాడు
కొల్లాయి గట్టుకొని కర్ర పట్టుకొని
జగాన్ని చుట్టొచ్చాడు
నవయుగాన్ని సృష్టించాడు
॥ సత్యాగ్రహ ప్రవక్త ॥
ఉప్పురవ్వనూ పిడికిట పట్టీ
ఉప్పెన సృష్టించాడు
వర్ణ వివక్షా, అస్పృశ్యతపై
రణమును సాగించాడు
మతఘర్షణలా మంటల నడుమ
మంచుకొండ వలె నిలిచాడు
మానవతను కాపాడాడు
తుపాకి గుండూ గుండెను చీల్చిన
హేరామంటూ ఒరిగాడు
జాతి గుండెలో నిలిచాడు
॥ సత్యాగ్రహ ప్రవక్త॥
-దేశపతి సాహితి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

