స్వాగత సంగీతం
పడిన విషవృక్షం నీడలపై నీలిమంటలో కెవ్వుమన్నది శత్రువు తుది నిశ్వాసం.
పడిన
విషవృక్షం నీడలపై
నీలిమంటలో కెవ్వుమన్నది
శత్రువు తుది నిశ్వాసం.
సంకెల
తెగి పడినచోట
నరుడొక నగశిఖరమై
లేచినాడు.
అమ్మా!
గతజీవిత శిథిలాలపై
విడిచిన అడుగుజాడలో
వినపడే విషాదగీతిక
విజయఘోషలై
నీ పెదవి దాటినది.
బ్రతుకు బైట
మృతవీరుని పెదవిలో
ప్రతిధ్వనులై
పైకెగసినది.
జయధ్వానమై
జలధులూగించినది.
అమ్మా!
అటు చూడు!
రేయి చివర
రెక్క విప్పిన పసిడిమబ్బు
వార్ధికి వారధి గట్టినదే’
జగతి గుండె జలదరించి
జై గీతం పాడినదే!
ఆకసమొక ఆనందాశ్రుపై
నీ కనురెప్పలో
ఆశలల్లినదే
కాలం నీ నుదుట
కుంకుమ రేఖలై నిలిచినదే!
కొమ్మకింద కదిలే
ఉదయానిల వీచిక
రాబోయే సుఖదినాల
చేతులెత్తి పిలిచినదే!
అమ్మా !
ఒడ్డుకొచ్చిన
కడలి కెరటం
విడిచిన నిశ్వాసపు నిశ్శబ్దం
లేమిలేని లోకానికి
స్వాగత సంగీతం.
– అజంతా
(అభ్యుదయ మాసపత్రికలో 1947 ఆగస్టు నెల సంచికలో ప్రచురించిన కవిత )
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

