కుగ్రామంలో స్వయంపాలన
కొండలు, వరిపొలాలతో అందంగా కనిపించే ఆ కుగ్రామం వెనుక బ్రిటిషర్లకు ఎదురుతిరిగిన పోరాట చరిత్ర ఉన్నది. అధిక పన్నులను వ్యతిరేకిస్తూ సొంత సర్కారు ఏర్పాటు చేసుకున్న సాహసోపేత గ్రామమది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఇస్సూరు ఆలయం వద్ద కనిపించే నల్లని శిలాఫలకం బ్రిటిషర్లు చేసిన నెత్తుటి గాయాలు, గ్రామస్థుల వీరోచిత పోరును గుర్తుచేస్తున్నది.
కొండలు, వరిపొలాలతో అందంగా కనిపించే ఆ కుగ్రామం వెనుక బ్రిటిషర్లకు ఎదురుతిరిగిన పోరాట చరిత్ర ఉన్నది. అధిక పన్నులను వ్యతిరేకిస్తూ సొంత సర్కారు ఏర్పాటు చేసుకున్న సాహసోపేత గ్రామమది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఇస్సూరు ఆలయం వద్ద కనిపించే నల్లని శిలాఫలకం బ్రిటిషర్లు చేసిన నెత్తుటి గాయాలు, గ్రామస్థుల వీరోచిత పోరును గుర్తుచేస్తున్నది.
దేశంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇస్సూరు ఒకడుగు ముందుకు వేసింది. ఇక పన్నులు చెల్లించకూడదని గ్రామసభలో నిర్ణయించారు. బ్రిటిష్‌వారిని తోసిరాజని సొంత పాలన ఏర్పాటు చేసుకున్నారు. గాంధీ టోపీలు ధరించిన యువకులు వీరభద్రేశ్వరాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వాధికారులు తమ గ్రామంలోకి రావొద్దని హెచ్చరిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో తాసిల్దార్‌గా జయన్న (16), సబ్ ఇన్స్పెక్టర్గా మాలపయ్య (16)ను నియమించారు. సాహుకార్ బసవేనప్ప నాయకత్వంలో ఈ నియామకం జరిగింది. మైనర్లకు జైలు శిక్ష ఉండదనే ఉద్దేశంతో వీరిని నియమించాడు. అనంతరం తన తోటి సహచరులతో కలిసి బసవేనప్ప స్వయం పాలన నియమాలు రూపొందించాడు. పన్నులు వసూలు చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను ఇంగ్లిష్ డాగ్స్ అంటూ అవమానించేవారు. వారి చేతుల్లోని ముఖ్య పత్రాలను లాగేసుకుని, చించేసే స్థాయికి వెళ్లారు.
పోలీసులు వచ్చి బెదిరింపుగా గాలిలోకి కాల్పు లు జరిపారు. 4 రోజుల తర్వాత సైన్యాన్ని దింపారు. ఈ సైన్యం రాగానే ఊరంతా లూటీ చేసింది. గ్రామస్థుల మీద దౌర్జన్యాలకు పాల్పడింది. దీంతో గ్రామస్థులు తిరగబడ్డారు. సైన్యంపై దాడి చేసి ఇద్దరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. సైన్యం దాడి తీవ్రతరం చేసింది. గ్రామస్థుల్లో కొంతమంది పారిపోయి దగ్గర్లోని అడవుల్లో దాక్కోగా.. పోలీసులు కొం తమందిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. వీరిలో ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు మహిళలకు జీవితకాల శిక్ష పడింది. మైసూరు మహారాజు జయచామరాజ వడయార్ రంగంలోకి దిగి.. బ్రిటిష్ అధికారుల తో మాట్లాడి కొంతమందికి శిక్ష తగ్గించేలా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

