మావోయిస్టులపై కేసుల ఎత్తివేత ఉత్తదేనా?
‘అన్నలారా.. ఆయుధాలు వీడి లొంగిపోండి.. మీపై ఉన్న కేసుల ఎత్తివేతకు బాధ్యత మాది. మీ పునరావాసం మేమే చూసుకుం టాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం. ఆధార్‌కార్డులు అందిస్తాం. ఉచిత వైద్యం అందిస్తాం’ అని ప్రభుత్వాలు నమ్మబలికిన మాటలు నీటమూటలయ్యాయి. కేసులు ఎత్తివేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఉత్తవేనని తేలిపోతున్నాయి. అడవులను వదిలి, ఆయుధాలను వీడినా కూడా మావోయిస్టులను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
- తెలంగాణలో 820 మందికిపైగా లొంగుబాటు.. వారిలో నలుగురు కేంద్ర కమిటీ, 22 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు.. భారీగా లొంగిపోయినా ముందుకు కదలని ఫైళ్లు
- లొంగిపోయిన మావోయిస్టుల్లో తీవ్ర నైరాశ్యం
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘అన్నలారా.. ఆయుధాలు వీడి లొంగిపోండి.. మీపై ఉన్న కేసుల ఎత్తివేతకు బాధ్యత మాది. మీ పునరావాసం మేమే చూసుకుం టాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం. ఆధార్‌కార్డులు అందిస్తాం. ఉచిత వైద్యం అందిస్తాం’ అని ప్రభుత్వాలు నమ్మబలికిన మాటలు నీటమూటలయ్యాయి. కేసులు ఎత్తివేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఉత్తవేనని తేలిపోతున్నాయి. అడవులను వదిలి, ఆయుధాలను వీడినా కూడా మావోయిస్టులను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
‘ఆపరేషన్ కగార్’ ధాటికి 2024 నుంచి 2026 మార్చి వరకు 3,927 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో 2024 నుంచి 2026 మే 18 వరకు 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన 245 మంది నాయకులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినా.. అవి అమలు కాలేదు. హత్య లు, పేలుళ్లు, పోలీసులపై దాడులు, ఉ.పా. వంటి తీవ్రమైన చట్టాల కింద నమోదైన కేసులు లొంగిపోయిన మావోయిస్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అంటున్నారు.
లొంగిపోయినా వెంటాడుతున్న కేసులు
2013 మే 25న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర కాన్వాయ్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. మృతుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేంద్రకర్మ, నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ తదితరులున్నారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. దశాబ్దానికిపైగా సాగిన విచారణ అనంతరం 2026 సెప్టెంబర్ 5న జగదల్పూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 10 మందిని దోషులుగా నిర్ధారించింది.
గత సెప్టెంబర్ 16న వారికి మరణశిక్ష విధించింది. ఈ కేసులో దోషులుగా తేలినవారిలో ప్రమీల మోడియం, చైతు లెకం అలియాస్ మున్నా, సుమిత అలియాస్ పునెం మోడియం, ముకా మండవి, కోసా కవాసి, అయతా మారం, మడామి దేవా, జోగా మడామి, బంజామి సన్నా, మహదేవ్ నాగ్ ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురు లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన మాటలు ఉత్తమాటలుగానే తేలిపోయాయని మావోయిస్టులు అంటున్నారు.
తెలంగాణలో 820 మందిలోనూ అదే భయం
తెలంగాణలో లొంగిపోయిన 820 మందిలో కేంద్ర కమిటీ సభ్యులు నలుగురు, రాష్ట్ర కమిటీ సభ్యులు 22 మంది, ప్రాంతీయ కమిటీ సభ్యుడు ఒకరు, డివిజనల్ కమిటీ సభ్యులు 45 మంది, ఏరియా కమిటీ సభ్యులు 173 మంది, ఇతర సభ్యులు 575 మంది ఉన్నారు. అందులో 245 మంది వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించినవారే. చాలామందిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధాల దోపిడీ, పేలుడు పదార్థాల వినియోగం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఉ.పా. వంటి చట్టాల కింద కేసులున్నాయి. దీంతో తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులు కూడా కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు.
నామమాత్రంగానే పునరావాసం
తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. అవి అమలు కావడం లేదని కొందరు మావోయిస్టులు చెప్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వారిపై ఉన్న కేసులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హమైన కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా.. అవి హామీలుగానే మిగిలిపోయాయని మావోయిస్టు నేతలు అంటున్నారు. ఇప్పటికైనా కేసుల రద్దుకు చర్యలు ప్రారంభించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

