న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి.. ఎస్హెచ్ఏఎన్టీఐ బిల్లుపై చర్చలో సురేశ్‌రెడ్డి
భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. అణుఇంధన రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తునందున భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని హెచ్చరించారు.
- అణు ఇంధనం కోసం జరిగే తవ్వకాలపై కేంద్రం అనుసరించే విధానం వెల్లడించాలి
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. అణుఇంధన రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తునందున భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని హెచ్చరించారు. అణు ప్రమాదాలు సంభవిస్తే వాటి తీవ్రత చాలా ఎకువగా ఉంటున్నందున భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని సూచించారు. రాజ్యసభలో ‘సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (ఎస్హెచ్ఏఎన్టీఐ-శాంతి)బిల్లు-2025’పై గురువారం జరిగిన చర్చలో సురేశ్‌రెడ్డి ప్రసంగించారు. కొత్త బిల్లుతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు, విద్యుత్తు కొరత గల ప్రాంతాలకు నిజంగానే విద్యుత్తు అందుతుందా? అని ప్రశ్నించారు. కేవలం పట్టణ లేదా పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితం కాకుండా, సామాన్యులకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నందున విద్యుత్తు ఉత్పత్తి చేయాలని చెప్పారు.
పర్యావరణ బాధ్యతపై స్పష్టత ఇవ్వండి
శాంతి బిల్లులో పర్యావరణ పరిరక్షణ అంశంపై స్పష్టత లేదని సురేశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అణువ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై పడే ప్రభావానికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంగా పేరొనాలని డిమాండ్‌చేశారు. అణు ఇంధనం కోసం జరిగే గనుల తవ్వకాలపై ప్రభుత్వం అనుసరించేవిధానాన్ని తెలుపాలని కోరారు. నల్లగొండ జిల్లా నల్లమలలో తవ్వకాలు, పరిశోధనలు జరుగుతున్నాయని, గిరిజన ప్రాంతాల్లో అణుపరీక్షల కారణంగా క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని, భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా, తాలుకా స్థాయిలోనూ వికసిత్ భారత్ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కోరారు.
ఉపాధి పథకం పేరు మార్పు సరికాదు
- 60:40 %నిబంధనను తొలగించాలి
- రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పేరు మార్పుతో దేశంలోని ప్రతి ఒక్కరూ బాధపడుతారని చెప్పారు. మహాత్ముడి పేరు తొలగింపుపై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. నిధుల వినియోగంలో కేంద్ర, రాష్ట్రాల వాటాను 90:10 శాతాన్ని 60:40 శాతంగా నిర్ణయించడం కరెక్ట్ కాదని, రాష్ట్రాలపై ఆర్థికభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కూలీల పనిదినాలను 100 నుంచి 125కు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని డిమాండ్‌చేశారు. గతంలో కేసీఆర్ సైతం అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సాగుకు అనుసంధానంతో తెలంగాణ రైతాంగం, గ్రామీణ పేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పారు. చేనేత కార్మికులకు సైతం ఈ స్కీం కింద పనికల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆస్తుల కల్పనపై దృష్టి సారించి పంచాయతీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. వ్యవసాయ పనులు ఉధృతంగా ఉన్న సమయంలో మినహాయింపు ఇవ్వడం శుభసూచకమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

