ఈసారి ఫిబ్రవరి నుంచే వేసవి
సాధారణంగా ఏటా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్లో ప్రారంభమయ్యే వేసవి ఈసారి ఫిబ్రవరిలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని ‘ైక్లెమేట్ ట్రెండ్స్' తన తాజా నివేదిక స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని,
- డిసెంబర్ నాటికే బలపడనున్న ఎల్ నినో
- తాజా నివేదికలో ‘క్లైమేట్ ట్రెండ్స్’ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఏటా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్లో ప్రారంభమయ్యే వేసవి ఈసారి ఫిబ్రవరిలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని క్లైమేట్ ట్రెండ్స్’ తన తాజా నివేదిక స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, చలికాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో దేశంలో వాతావరణ సమతుల్యత అస్తవ్యస్తమవుతున్నదని పేర్కొన్నది. ఈ ఏడాది డిసెంబర్ నాటికే ఎల్ నినో మరింత బలపడి, ఎండలు ముదురుతాయని, ఫిబ్రవరి నాటికే ఉష్ణోగ్రతలు 40 సెల్సియస్ డిగ్రీలు దాటిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో అనూహ్యంగా కోల్డ్వేవ్ కూడా ఉండవచ్చని చెప్తున్నారు. వచ్చే ఏడాది శీతాకాలం ప్రారంభంలో కూడా ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఆగస్టులోనే అధిక ఉష్ణోగ్రతలు
గత 125 ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఎల్ నినో బలంగా మారడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆగస్టులో దేశ సగటు ఉష్ణోగ్రత 28.01 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైందని, ఇది సాధారణ స్థాయి కంటే 0.67 డిగ్రీలు అధికమని స్పష్టం చేశారు. ఆగస్టులో కేవలం 213.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైందని, ఇది సాధారణ స్థాయి కంటే 16% తకువని తెలిపారు. ఎల్ నినో వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రుతుపవన వ్యవస్థ దెబ్బతిన్నదని, ఆగస్టులో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజులపాటు చురుకుగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైందని వివరించారు.
సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి
సెప్టెంబర్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దేశవ్యాప్తంగా లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ)లో 91% కంటే తకువ వర్షపాతం నమోదైంది. 1971 నుంచి 2020 వరకు సెప్టెంబర్లో సగటున 167.9 మి.మీ. వర్షపాతం నమోదవగా.. ఈ ఏడాది మేఘాలు కరుగడంతో 141.7 మిల్లీమీటర్లకే పరిమితమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

