అరగంట డ్యాన్స్.. విద్యార్థిని హఠాన్మరణం
తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెషర్స్ డేను సంతోషంగా జరుపుకొంటున్న విద్యార్థిని హఠాత్తుగా మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
గంగాధర, ఆగస్టు 11: తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెషర్స్ డేను సంతోషంగా జరుపుకొంటున్న విద్యార్థిని హఠాత్తుగా మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఉపాధ్యాయులు, స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు ప్రదీప్తి (17) స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. శుక్రవారం పాఠశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా, తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహం గా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్‌లో కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తమతోపాటు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రదీప్తి మృతి చెందడంతో తోటి విద్యార్థులు గుండెలవిసేలా రోధించారు. ఫ్రెషర్స్ డే అంటూ సంతోషంగా పాఠశాలకు వెళ్లిన కూతురు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి గుండెపోటుతో మృతిచెందిందా? మరే కారణంతోనా? అనేది ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

