హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో అమల్లో ఉన్న సమ్మెల నిషేధాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
డిసెంబర్ ఒకటి నుంచి ఇది అమల్లోకి రానున్నది. తెలంగాణ అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.