ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కట్టుదిట్టంగా లాక్ డౌన్
లాక్ డౌన్ |జిల్లాలో రెండో రోజు మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

నల్లగొండ : జిల్లాలో రెండో రోజు మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎవరూ రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి సడలింపు దొరకడంతో నిత్యావసర వస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అన్ని రకాల వ్యాపార కేంద్రాలు తెరుచుకున్నాయి. వైన్స్ షాప్స్ వద్ద సాధారణ రద్దీ కనిపించింది.
ఉదయం 10 గంటల తర్వాత యథావిథిగా అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన కూడళ్లలోకి లాక్ డౌన్ విధుల్లోని పోలీసులను మోహరించారు. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. పట్టణాలతో పాటు గ్రామీణ రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లు అన్ని నిర్మానుషంగా మారాయి. ఎస్పీ రంగనాధ్ స్వయంగా నల్గొండలో పరిస్థితిని పర్యవేక్షించారు. కరోనా పరీక్షలు, వ్యాక్షిణేషన్ యథావిథిగా కొనసాగాయి.
వ్యవసాయ సంబంధించిన పనులు, ధాన్యం కొనుగోళ్లు కూడా కొనసాగాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ కట్టుదిట్టగా అమలు అయ్యింది. జాతీయ రహదారులపై అనుమతి ఉన్న వాహనాలతో పాటు సరుకు రవాణా వాహనాల రాకపోకలు తిరుగుతున్నాయి.
రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తూ అనుమతి పత్రలు ఉంటేనే అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కోదాడ సరిహద్దుల్లో ఎస్పీ భాస్కరన్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ లాక్ డౌన్ ను పర్యవేక్షణ చేశారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు విధించారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

